EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

స్వర్ణముఖి నది నుండి జోరుగా ఇసుక దోపిడీ

స్వర్ణముఖి నది నుండి జోరుగా ఇసుక దోపిడీ

పోలీసుల అండతోనే అక్రమ ఇసుక రవాణా అంటూ స్థానికుల ఆరోపణ

అక్రమ ఇసుక రవాణా అరికట్టడం ఎస్ ఐ కి సవాల్ గా మారిన వైనం

11.09.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.

పెళ్లకూరు మండలంలోని పుల్లూరు,ముమ్మారెడ్డిగుంట కేంద్రాలుగా స్వర్ణముఖి నది నుండి ఇసుక ట్రాక్టర్లు రయ్.. రయ్ అంటూ వెంకటగిరి, శ్రీకాళహస్తి, మేనకూరు సెజ్ పరిశ్రమలకు యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేసి అధికార పార్టీకి చెందిన పలువురు వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారు. ఇసుక రవాణా అరికట్టేందుకు స్వర్ణముఖి నది వద్ద పోలీస్ నిఘా ఏర్పాటు చేసినప్పటికీ కొందరు పోలీసులు చేతివాటం వల్ల వ్యాపారులు రేయింబవళ్లు ట్రాక్టర్లతో స్వర్ణముఖి నది నుండి ఇసుకను జోరుగా తరలిస్తున్నారు.దాంతో ఇక్కడ ఇసుక అక్రమ రవాణా అరికట్టడం స్థానిక ఎస్సై కు సవాల్ గా మారింది. వెంకటగిరి, శ్రీకాళహస్తి, తొట్టంబేడు ప్రాంతాలతో పాటు మేనకూరు సెజ్ పరిశ్రమలకు ట్రాక్టర్లతో ఇసుక జోరుగా తరలించి అధికార పార్టీకి చెందిన తెలుగు తమ్ముళ్లు జేబులు నింపుకుంటున్నారు. స్వర్ణముకి నదిని కాపాడాల్సిన అధికారులు కొందరు ఇసుక వ్యాపారులతో కుమ్మక్కై ఇసుకను తోడేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వర్ణముఖి నది పరివాహక గ్రామాలలోని పలువురు రైతులకు సాగునీరు, పలు మంచినీటి పథకాలకు త్రాగునీరు మూలాధారం స్వర్ణముఖి నది. అయితే రేయింబవళ్ళు ఇసుకను తోడేయడం వల్ల భూగర్భ జలాలు ఇంకిపోయి నీటి ఎద్దడి ప్రమాదం పొంచి ఉంది. టిడిపి అధికారంలోకి రాగానే స్వర్ణముఖి నది పరివాహక గ్రామాల్లోని కొందరు టిడిపి కార్యకర్తలు, కొత్తగా ట్రాక్టర్లను ఇబ్బడిముబ్బడిగా కొనుగోలు చేసి స్వర్ణముఖి నదిలోకి దింపేశారు. స్వర్ణముఖి నదిలోని ఇసుకను డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా అధికారం అడ్డం పెట్టుకుని టిడిపి తమ్ముళ్లు అక్రమ ఇసుక వ్యాపారానికి తెర లేపారు. ఈ క్రమంలో పలు ప్రాంతాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు స్వర్ణముఖి నది నుండి డాక్టర్లతో మేనకూరు సెజ్ పరిశ్రమలకు, వెంకటగిరి, శ్రీకాళహస్తి పట్టణాలకు జోరుగా తరలించి ఒక్కో ట్రాక్టర్ ఇసుకను 4500 నుండి 5వేలకు పైగా విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. స్వర్ణముఖి నది వద్ద నిఘా ఉన్న పోలీసులే అక్కడ వ్యాపారులతో కుమ్మక్కై ఇసుక అక్రమ రవాణా కి ప్రత్యక్షంగా సహకరిస్తున్నట్లు స్థానికులు బాహాటకంగా ఆరోపిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Related News

Select the Topic
Scroll to Top