EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి

సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలి

 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా అమలు చేయాలి

 అర్హులకు రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలి.

బీజేఎల్పీ సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం

హైదరాబాద్ సెప్టెంబర్ 12 (ఈతరం భారతం);అసెంబ్లీ, బీజేపీఎల్పీ కార్యాలయంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది .ఈ సమావేశానికి బిజెపి ఎంపీలు డాక్టర్ లక్ష్మణ్, ఈటెల రాజేందర్, అరవింద్, డీకే అరుణ, గోడెం నగేష్, విశ్వేశ్వర్ రెడ్డి లతో పాటు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ,పాయల శంకర్,వెంకట రమణ రెడ్డి,పైడి రాకేష్ రెడ్డి,పాల్వాయి హరీష్ బాబు,రామారావు పాటిల్,దన్పాల్ సూర్యనారాయణ,ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ఈ సమావేశం లో ఎజెండాలోని పది అంశాలతో పాటు.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.ఈ సందర్బంగా ఈ క్రింది డిమాండ్స్ చేస్తూ సమావేశం తీర్మానించింది.- సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి.- ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం బేషరుతుగా అమలు చేయాలి.- అర్హులకు రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలి.- పార్టీ ఆధ్వర్యంలో త్వరలో హైదరాబాద్ లో దీక్ష.- అర్హులందరికీ రేషన్ కార్డ్స్ పంపిణీ చేయాలి.- వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వే చేయించి బాధిత రైతులకు ఆర్థిక సహాయం అందించాలి.- ‘హైడ్రా’ నిష్పక్ష పక్షపాతంగా వ్యవహారించాలి.- పార్టీ మారిన ఎమ్మెల్యే లపై హైకోర్టు ఆదేశాలను స్పీకర్ గారు తప్పకుండా అమలు చేయాలి.అలాగే పలు నిర్ణయాలను తీసుకున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ,- ఎండోమెంట్ భూములను రక్షణకై పోరాటం.- బీజేపీ సభ్యత్వ నమోదు డ్రైవ్ ను వేగవంతం చేయాలని నిర్ణయించారు

.

 

Related News

Select the Topic
Scroll to Top