ఏచూరి మృతి పై బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంతాపం
హైదరాబాద్ సెప్టెంబర్ 12 (ఈతరం భారతం);సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఏచూరి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ప్రజా ఉద్యమాలకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి సీతారాం ఏచూరి అని కొనియాడారు.ఏచూరి మరణం, దేశ రాజకీయాలకు, కార్మిక లోకానికి, లౌకిక వాదానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.సీతారాం ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని తెలిపారు
.















