EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 16 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు   

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 16 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ సెప్టెంబర్ 13 (ఈతరం భారతం); : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 16 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని పోలీసులు నిర్ణయించారు. సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ ల్యాండింగ్ నుంచి యశోద హాస్పిటల్ వరకు సర్వీస్ రోడ్డు నిర్మాణ పనుల కారణంగా సెప్టెంబర్ 14 నుంచి 30వ తేదీ వరకు ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.ఐటీ కారిడార్‌ మీదుగా ప్రయాణించేవారు సైబర్ టవర్స్, 100 ఫీట్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్ నుంచి జేఎన్‌టీయూ, మూసాపేట్ వైపు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి.

1. టోడీ కాంపౌండ్ నుంచి 100 ఫీట్ జంక్షన్ మీదుగా JNTU, మూసాపేట్ వైపు వచ్చే ట్రాఫిక్ పర్వత్‌నగర్ జంక్షన్ వద్ద మళ్లింపు తీసుకొని ఖైత్లాపూర్ వంతెన మీదుగా వెళ్లవచ్చు.

2. ఐకియా, సైబర్ గేట్‌వే, COD జంక్షన్ నుంచి సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ మీదుగా JNTU వైపు వెళ్లే ట్రాఫిక్ నేరుగా జేఎన్టీయూ వైపు కొనసాగుతుంది.

3. సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ కింద JNTU వైపు ప్రయాణించే వాహనాలను N-గ్రాండ్ హోటల్ వద్ద మళ్లించవచ్చు. అలా N-కన్వెన్షన్ మీదుగా వెళ్లవచ్చు. ఇవే కాకుండా వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా భాగ్యనగరంలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

 

Related News

Select the Topic
Scroll to Top