EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ వరదల సాయంగా నిధులు విడుదల చేయాలి  కేంద్ర బృందంతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం

ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ వరదల సాయంగా నిధులు విడుదల చేయాలి

 కేంద్ర బృందంతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం

హైదరాబాద్ సెప్టెంబర్ 13 (ఈతరం భారతం);వరద నష్టం అంచనాపై కేంద్ర బృందంతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావీశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రఘురాం రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు. హాజరైనారు.రాష్ట్రంలో వరదలతో నష్టంపై పలు విజ్ఞప్తులను కేంద్ర బృందం దృష్టికి సీఎం తీసుకెళ్లినారు.వరదలతో తీవ్ర నష్టం జరిగిందన్న సీఎం. వరదల నేపథ్యంలో ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయంగా నిధులు విడుదల చేయాలని కోరిన సీఎం. ఖమ్మం మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే అక్కడ వరద నివారణకు శాశ్వత పరిష్కారమని తెలిపిన సీఎం. భవిష్యత్ లో రాష్ట్రంలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకునేందుకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని కోరిన సీఎం. శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం యాక్షన్ ప్లాన్ ఉండాలని సీఎం విజ్ఞప్తి చేసారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top