ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం ఎంపికైన జ్యోతి
అభినందించిన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్
హైదరాబాద్ సెప్టెంబర్ 14 (ఈతరం భారతం);భారత మహిళల హాకీ జట్టుకు ఎంపికైన క్రీడాకారిని ఎదుళ్ల జ్యోతిని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి అభినందించారు. భారత మహిళా హాకీ జట్టుకు ఎంపికైన సందర్భంగా శనివారం నాడు తన తండ్రితో కలిసి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డిని మర్యాదపూర్వకంగా జ్యోతి కలిసింది. ఈ సందర్భంగా చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అకాడమిక్ చెందిన జ్యోతి ఇటీవల జూనియర్ హాకీ వరల్డ్ కప్ జట్టులో ఆడి ప్రతిభ చూపించిన జ్యోతి కి మంచి భవిష్యత్తు ఉందని, సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్ షిప్ లు, నేషనల్ ఛాంపియన్ షిప్ లలో ఖేలో ఇండియా గేమ్స్ యూనివర్సిటీ గేమ్స్ లలో పాల్గొన్న జ్యోతి అభినందనీయమని ఆయన అన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తరఫున జ్యోతి కి సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన తెలిపారు.















