EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

గోవిందరాజస్వామి వారికి శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

తిరుప‌తి సెప్టెంబర్ 15 (ఈతరం భారతం);: తిరుపతి గోవిందరాజస్వామి వారి పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత గోవింద‌రాజ‌స్వామివారి ఉత్సవర్లను యాగశాలకు తీసుకు వచ్చి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, ప‌సుపు, చందనంలతో అభిషేకం నిర్వహించారు. మూలవర్లకు, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి, శ్రీ మఠం ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయ‌ర్‌స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, సూప‌రింటెండెంట్ మోహ‌న్‌రావు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌ ధ‌నంజ‌య‌ పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top