EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు పై మహిళపై అత్యాచారం        అతణ్ని ఎన్‌కౌంటర్ చేయాలంటూ గ్రామస్తుల డిమాండ్ పోలీస్ స్టేషన్ ఎదుట భైఠాయించి ధర్నా

ములుగు సెప్టెంబర్ 15 (ఈతరం భారతం);: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని ఓ గ్రామంలో వరస అత్యాచారాలు చేస్తూ హడలెత్తిస్తున్న కామాంధుడు శివకుమార్.. శనివారం రాత్రి మరో మహిళపై దారుణానికి ఒడిగట్టాడు. వృద్ధురాలని కూడా చూడకుండా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై కన్నేశాడు. ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో చొరబడి అత్యాచారం చేశాడు. గదిలోనే బంధించి రాత్రి మెుత్తం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉదయం ఘటన గురించి తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.గ్రామస్థులంతా వెంకటాపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. నిందితుడు శివకుమార్‌ను కఠినంగా శిక్షించాలని స్టేషన్ ఎదుట బైఠాయించి డిమాండ్ చేశారు. శివకుమార్ గతంలోనూ ఆరుగురు మహిళలపై అత్యాచారం చేశాడని గ్రామస్థులు ఆరోపించారు. ఇలాంటి కామాంధుణ్ని వదలకూడదని, వదిలితే మరిన్ని దారుణాలకు పాల్పడతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతణ్ని ఎన్‌కౌంటర్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట భైఠాయించి డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఏ మూలన చూసినా ప్రతిరోజూ మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన శిక్షలు వేస్తున్నా నేరస్థుల్లో మాత్రం భయం పుట్టడం లేదు. ఒక ప్రాంతంలో అత్యాచారం జరిగిందంటూ పెద్దఎత్తున నిరసనలు జరిగిన మరుసటి రోజే మరో అత్యాచారం గురించి వినాల్సిన దుస్థితి నెలకొంది. కామాంధులకు కఠిన శిక్షలు పడుతున్నా చివరికి ఎన్‌కౌంటర్లు జరిగిన ఘటనలు కళ్లెదుటే కనిపిస్తున్నా నిందితుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు.

 

Related News

Select the Topic
Scroll to Top