EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వరంగల్ చెరువుల పరిరక్షణ కోసం వాడ్రా ను ఏర్పాటు చేయాలి

15.09.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల. : వరంగల్ చెరువుల పరిరక్షణ కోసం వాడ్రా ను ఏర్పాటు చేయాలని, భద్రకాళి, వడ్డేపల్లి చెరువులలో కట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలోని అదాలత్ సెంటర్ అమరుల స్థూపం వద్ద విసికె పార్టీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం పౌర సమాజ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.జిలుకర శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రొ.ఎర్రగట్టు స్వామి మాట్లాడుతూ వరంగల్ చెరువుల రక్షణ కోసం హైడ్రా తరహాలో వాడ్రా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కోండ్ర నర్సింగరావు మాట్లాడుతూ భద్రకాళి చెరువులో కట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. డా.శేషు మాట్లాడుతూ వరంగల్ జిల్లాను అక్రమ కబ్జాదారుల నుండి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కబ్జాలకు సహకరించిన అధికారులను అరెస్టు చేయాలని సాయిని నరేందర్ డిమాండ్ చేశారు. భద్రకాళి, వడ్డేపల్లి, అగర్తల చెరువులను పునర్జీవింప చేయాలని డా.చింతం ప్రవీణ్ డిమాండ్ చేశారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డా.జిలుకర శ్రీనివాస్ మాట్లాడే భద్రకాళి చెరువు శిఖం భూములు, బఫర్ జోన్ భూములలో కట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది అని గుర్తు చేశారు. కార్పొరేషన్ అధికారులు భద్రకాళి కబ్జాదారుల కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. వాడ్రాను ఏర్పాటు చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, నాలాలు, పార్కులను, ప్రభుత్వ స్థలాలను కాపాడాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొ. ఎర్రగట్టు స్వామి, డా.తిరునహరి శేషు, కోండ్ర నర్సింగరావు, డా.వెంగళ్ రెడ్డి, సాయిని నరేందర్, డా.చింతం ప్రవీణ్, తాడిశెట్టి క్రాంతి కుమార్, గాజాల గోవర్ధన్, మల్యాల కృష్ణ, చుంచు రాజేందర్, మాడ్గుల నర్సయ్య, సాధు కుమార స్వామి, బి. కృష్ణస్వామి, సింగారపు రవిప్రసాద్, పరశరాములు, ఎబినైజర్, వస్కుల రవీందర్, గుగులోతు సాగర్, చుంచు రాజేందర్, రామచందర్ అంకేశ్వరం, కన్నాల రవి, తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top