EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వరద బాధిత విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ రోటరీ క్లబ్ ఆఫ్ బెంగళూర్ సహకారం తో  ప్రముఖ వ్యాపారవేత్త ఈశ్వర ప్రగడ

15.09.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం : మున్నేరు వరద ముంపు ఖమ్మం ప్రజలను అతలాకుతలం చేసిందని, ఈ వరద ముంపులో అనేకమంది ప్రజలు సర్వం పోగొట్టుకొని కట్టు బట్టలతో నిలిచారని అలాంటి వారిని ఆదుకోవడానికి పెద్ద మనసుతో దాతలు మరింత ముందుకు రావాలని ప్రముఖ వ్యాపారవేత్త హీరో హోండా షోరూం అధినేత ఈశ్వర ప్రగడ హరిబాబు అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ బెంగళూర్ అధ్యక్షులు పవిత్రన్ అందించిన ఆర్థిక సహకారంతో ఆదిత్య ఫౌండేషన్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ పబ్బరాజు అచ్యుత రామారావు సేవాభావంతో వరద బాధిత విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేశారు. ఆదివారం స్థానిక వెంకటేశ్వర నగర్ ప్రాంతంలోని బీరప్ప గుడిలో బొక్కల గడ్డ తదితర ప్రాంత నివాసంలోని 104 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఒక్కొక్కరికి 10 నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద పంపు నుండి ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకొని సాధారణ జీవన విధానంలోకి వస్తున్నారన్నారు. మానవత దృక్పథంతో బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ బెంగళూరు అధ్యక్షులు పవిత్రన్, ఆదిత్య ఫౌండేషన్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ పబ్బరాజు అచ్యుత రామారావు వైద్యశాఖ రిటైర్డ్ ఉన్నతాధికారి డాక్టర్ సోమరాజు, సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీసర జైపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బోయినపల్లి కోటిరెడ్డి, నగర అధ్యక్షులు నూకల మోహన్, టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ కర్నాటి రామకృష్ణారెడ్డి, భువనవిజయం జిల్లా అధ్యక్షులు వేంకట రాణా ప్రతాప్, తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ పెరుగు వెంకటరమణ యాదవ్, బీరప్ప దేవాలయం కమిటీ చైర్మన్ దేవర వెంకన్న, రేగు లింగస్వామి, జెట్టి కృష్ణయ్య, నాలం సతీష్ ఆళ్ళ సాయికిరణ్, మారాటి ఆదయ్య, మోటే కుమార్, సైదులు, నాగులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top