EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బీజేపీ ఖమ్మం జిల్లా సభ్యత్వ పర్వం

15.09.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం. : బీజేపీ ఖమ్మం జిల్లా సభ్యత్వ పర్వం బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు బెల్గాం శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సభ్యత్వ ఇంచార్జ్ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లాలో సుమారు రెండు లక్షల పైన సభ్యత్వ నమోదు జరగాలని, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్లి భారతీయ జనతా పార్టీ కుటుంబంలో సభ్యులు కావాలని కోరాలని తద్వారా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం సాధ్యమవుతుందని అన్నారు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్నందునే భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేసి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులను భారతీయ జనతా పార్టీ నుండి గెలిపించడం జరిగిందని, మన పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేస్తున్నారని, ఇటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు వచ్చిన కార్యకర్తలతో అభయ్ పాటిల్ పార్టీ ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర క్రమశిక్షణ సంగం కమిటీ చైర్మన్ మాజీ MLA మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు అని కార్యకర్తలు ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని ఒక అవకాశం గా తీసుకొని ప్రజల వద్దకు చేరుకోవాలని కార్యకర్తలు కృషి చేస్తే తెలంగాణలో అధికారం మనదే అని వారు దేమ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఖమ్మం జిల్లా లో పార్టీ విజయ ఢంకా మొగించాలి అంటే కార్యకర్తలు అందరూ కూడా ఈ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొని లక్ష్యాన్ని చేరుకోవాలని, ఈ సభ్యత్వ నమోదులో జిల్లా పార్టీ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నదని వారు అన్నారు. కార్యకర్తలు కృషి చేస్తే ఎలా ఉంటుందో పార్లమెంట్ ఎన్నికలలో చూ పించామని ఖమ్మం జిల్లాలో రాబోయే కాలంలో గెలుపే లక్ష్యం గా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సభ్యత్వ నమోదు ఖమ్మం జిల్లా ఇన్చార్జి యడ్ల అశోక్ రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామ్లింగేశ్వరావు, 7వ డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్, నున్న రవి, జిల్లా ఉపాధ్యక్షురాలు మంద సరస్వతి, అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top