హైదరాబాద్ సెప్టెంబర్ 16 (ఈతరం భారతం); : లంబోదరుడి నిమజ్జనం సందర్భంగా జంటనగరాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర వైద్య చికిత్స అవసరమున్నవారికి అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ.. అధికారులను ఆదేశించారు. అందుకుతగ్గట్లు వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. “నిమజ్జనం జరిగే ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలి. అత్యవసర పరిస్థితుల్లో సత్వర వైద్యాన్ని అందించేందుకు డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండాలి” అని దామోదర సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాలలో ముందస్తుగా 30 చోట్ల హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు.రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్‌కు లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు, పర్యాటకులకు అత్యవసర పరిస్థితులలో వైద్య సేవలు అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అందుకు తగ్గట్లు డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచారు. వైద్య అత్యవసర పరిస్థితులలో ఆసుపత్రికి చేరుకునే వారికి సత్వర వైద్యాన్ని అందించేందుకు సమాయత్తం అయ్యారు.















