EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లు కలిసి తెలంగాణ కు విముక్తి కల్పించారు సెప్టెంబర్ 17 న తెలంగాణ కు విముక్తి కలిగిన రోజు సర్దార్ పటేల్ తో బీజేపీ కి ఏం సంబంధం.. పటేల్ నిక్కార్స్ అయిన కాంగ్రెస్ బిడ్డ కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ లో కోవర్టుగా పని చేశారు బిఆర్ఎస్ లో పార్టీ అధ్యక్ష పదవిని వేరొకరికి ఇచ్చే దైర్యం ఉందా..  తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శ్యాముల్

హైదరాబాద్ సెప్టెంబర్ 16 (ఈతరం భారతం);సెప్టెంబర్ 17 న తెలంగాణ కు విముక్తి కలిగిన రోజని మందుల తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యేశ్యాముల్ అన్నారు. సోమవారం గాంధీ భవన్ లో పార్టీ అధికార ప్రతినిధి భవాని రెడ్డి, సంగిశెట్టి జగదీష్, జగదీష్ నేతలతో కలిసి మీడియా సమావేశం లో మాట్లాడుతూ హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ తో జరిగింది.కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లు కలిసి తెలంగాణ కు విముక్తి కల్పించారన్నారు.సర్దార్ పటేల్ తో బీజేపీ కి ఏం సంబంధం.కాంగ్రెస్ మనిషిని.. బీజేపీ మా వారసుడు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. సర్దార్ పటేల్ నిక్కార్స్ అయిన కాంగ్రెస్ బిడ్డ.తెలంగాణ ఉద్యమంలో బీజేపీ లేదు.తెలంగాణ లో బీజేపీ పాచికలు పారవు.మొన్నటి ఎన్నికల్లో బియార్ఎస్ వల్ల నాలుగు సీట్లు వచ్చాయి.బీజేపీ పాలన లో బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు ఏమైన లబ్ది కలిగిందా..కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ లో కోవర్టుగా పని చేశారు.కౌశిక్ లాంటి వ్యక్తి ని వెనకేసుకొస్తే.. హరీష్ రావు, కేటీఆర్ పరువు పోతుంది.డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే హర్హత లేదు.రుణమాఫీ ఏక కాలంలో పూర్తి చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అందిస్తుంది.కౌశిక్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి కి పీసీసీ ఇచ్చే మొగోడివా..?రాష్ట్రం లో బిఆర్ఎస్ పని అయిపోంది. బిఆర్ఎస్ లో పార్టీ అధ్యక్ష పదివిని వేరొకరికి ఇచ్చే దైర్యం ఉందా..కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ కు ఇచ్చారు.ఎస్సీ వర్గీకరణ కోసం మంత్రి వర్గ ఉప సంఘం వేయడం శుభ పరిణామం. త్వరలో వర్గీకరణ అమలు జరుగుతున్దన్నారు.

Related News

Select the Topic
Scroll to Top