హైదరాబాద్ సెప్టెంబర్ 16 (ఈతరం భారతం);వరద బాధితుల సహాయార్ధం సిఎం రిలీఫ్ ఫండ్ కి పిసిసిసి అధికార ప్రతినిధి భవాని రెడ్డి లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మేరకు సోమవారం గాంధీ భవన్ టిపిసిసి నూతన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు చెక్కును అందచేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.















