హైదరాబాద్ సెప్టెంబర్ 16 (ఈతరం భారతం);హైదరాబాద్ మహానగరంలో ప్రతియేటా ప్రతిష్టాత్మకంగా జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఈ సారి మరో ప్రత్యేకతను కూడా చోటు చేసుకుంది.తెలుగు ప్రేక్షకుల అభిమాన టివి ఛానల్ జెమిని కుటుంబం నుండి జెమిని సీరియల్లో నటించే ప్రేక్షకుల అభిమాన నటినటులు నగరం నలు మూలలా ఉండే గణేష్ మండపాలను స్వయంగా సందర్శించి గణేష్ పూజలో పాల్గొని అక్కడ నిర్వాహకులను భక్తులను స్వయంగా కలిసి వారితో ముచటిస్తారు ఈ కార్యక్రమం “అమ్మకు ప్రేమతో” సీరియల్ లోని నటీనటులు బాలనగర్ లోని శివాజీ యువసేన వారి గణేష్ మండపాన్ని దర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం జెమినీ టీవీ మరియు సి పి ఫౌండేషన్ వారి సారథ్యంలో జరిగింది.అమ్మకు ప్రేమతో సీరియల్ మధ్యాహ్నం 12.౩౦ గంటలకు ….తిరిగి రాత్రి 9 ౩౦ గంటలకు.ఆ… అంటే అమ్మ…! మనందరికీ అమ్మ మన జీవితం లో ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందే కదా ! అటువంటి అమ్మ ఒక్కసారిగా దూరమైపోతే,? వినడానికే చాల కష్టంగా ఉంది కదా ! మన కావ్య కూడా అంతేనండి! తన అమ్మ ఎందుకు దూరం అయిందో తెలియక ,ఎక్కడుందో తెలుసుకోవాలని పడే తాపత్రయంలో…… చివరికి అమ్మను చేరుకుందా ! చేరుకునే క్రమంలో తనకి ఎదురైనా ఒడిదుడుకులని ఎలా ఎదుర్కుందో చూడాలంటే…చూడండి మన జెమినీ టీవీ లో సరికొత్త సీరియల్ అమ్మకు ప్రేమతో…. !















