EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రోడ్లపై చెత్త వేయకుండా జీహెచ్ఎంసీ సిబ్బందికి ప్రజలు సహకరించాలి      జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి     

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (ఈతరం భారతం) : గణేష్ నిమజ్జనం నేపథ్యంలో బల్దియా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… రోడ్లపై చెత్త వేయకుండా జీహెచ్ఎంసీ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. మొత్తం 15 వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిమజ్జనంలో పాల్గొంటున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 465 క్రేన్స్, హుస్సేన్ సాగర్లో 38 క్రేన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో జీహెచ్ఎంసీ నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేసిందన్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు జీహెచ్ఎంసీ సిబ్బందికి అసలైన పని ఉంటుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పేర్కొన్నారు.

సెలవులు రద్దు…

కాగా.. రేపటి మహా నిమజ్జనానికి జీహెచ్ఎంసీ తరఫున ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 160 గణేష్ టీమ్స్ పనిచేయనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నిమజ్జనానికి 10 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు అయ్యాయి. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. నిమజ్జనం మరుసటి రోజు అదనంగా మరో 500 మంది సిబ్బంది పాల్గొననున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 73 వినాయక పాండ్స్, పెద్ద చెరువులలో నిమజ్జనానికి ఏర్పాటు చేశారు. అలాగే రేపటి నుంచి మూడు రోజులపాటు జీహెచ్ఎంసీ సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top