EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పోడియం తొలగించే కార్యక్రమం ప్రారంభం

విజయవాడ, సెప్టెంబర్ 16 (ఈతరం భారతం);: సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పోడియం తొలగించే కార్యక్రమాన్నిఅధికారులు ప్రారంబించారు. మొదటగాగుణదల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పోడియం తొలగించే కార్యక్రమాన్ని సోమవారం అధికారులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్పి సిసోడియా, కమీషనర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఎంవి శేషగిరి బాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉండేదన్నారు. ‘‘నా చిన్నప్పుడు చాలా మంది బ్యాంకులకు వెళ్లాలన్నా భయపడే వారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’’ అని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వచ్చి నేరుగా తమ అభిప్రాయాలు చెబుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు కూడా ప్రభుత్వ అధికారులు.. ప్రజా సేవకు ముందుండాలని ఆదేశించారన్నారు. వివిధ పనులపై వచ్చే ప్రజలను మర్యాదగా చూస్తూ.. వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారన్నారు. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కోర్టుల తరహాలో బెంచ్‌లు ఉండటం బ్రిటీష్ పాలన నాటి నుంచి ఉందన్నారు. ఆధునిక కాలంలో కాలం చెల్లిన ఇటువంటి వాటిని పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు వచ్చే వారు కోర్టులకు వస్తున్నామనే భావనలో ఉంటున్నారని.. ఇటువంటి వాటికి స్వస్తి చెప్పాలనే ప్రభుత్వం ఈ బెంచ్‌లను తొలగించాలని సర్క్యూలర్ ఇచ్చిందన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సరళతరమైన సేవలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇది గొప్ప సంస్కరణగా తాను భావిస్తున్నానని.. ప్రజలకు ప్రభుత్వ అధికారులు ఎప్పుడూ సేవకులే అని ఆర్పీ సిసోడియా చెప్పుకొచ్చారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top