EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా

న్యూ డిల్లీ సెప్టెంబర్ 17 (ఈతరం భారతం);ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు ఇవాళ సాయంత్రం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆప్‌ శాసనసభా పక్ష నేతగా మంత్రి అతిశీని ఎన్నుకున్నట్లు ఎల్జీకి కేజ్రీ తెలిపారు.మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ అరెస్టైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో శుక్రవారం ఆయన తీహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఆదివారం ఆప్‌ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి తన స్థానాన్ని భర్తీ చేసే అంశంపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.ఈ నేపథ్యంలోనే ఇవాళ సీఎం కేజ్రీవాల్‌ ) నివాసంలో శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఢిల్లీ తదుపరి సీఎంగా అతిశీని కేజ్రీ ప్రతిపాదించారు. కేజ్రీ ప్రతిపాదనకు పార్టీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. దీంతో ఆమె శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు. వారం రోజుల్లో అతిశీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అప్పటి వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ కొనసాగనున్నారు.

Related News

Select the Topic
Scroll to Top