EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బుల్డోజ‌ర్ల‌తో కూల్చివేసే ప్ర‌క్రియ‌కు సుప్రీంకోర్టు బ్రేక్      ఆకాశం ఊడిప‌డ‌దు.. అక్టోబ‌ర్ ఒక‌టి వ‌ర‌కు ఆగండని ఆదేశం

న్యూఢిల్లీ సెప్టెంబర్ 17 (ఈతరం భారతం);: అక్ర‌మ నిర్మాణాల‌ను బుల్డోజ‌ర్ల‌తో కూల్చివేసే ప్ర‌క్రియ‌కు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ వ‌ర‌కు అలాంటి చ‌ర్య‌ల‌ను నిలిపివేయాల‌ని కోర్టు ఆదేశించింది. బుల్డోజ‌ర్ వినియోగంపై మ‌ళ్లీ వాద‌న‌లు చేప‌ట్టే వ‌ర‌కు ఆ చ‌ర్య‌ల‌ను ఆపేయాల‌న్న‌ది. వ‌చ్చే విచార‌ణ వ‌ర‌కు కూల్చివేత‌ల‌ను ఆపేస్తే .. ఆకాశం ఏమీ ఊడిప‌డ‌దు అని కోర్టు పేర్కొన్న‌ది. జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి, కేవీ విశ్వ‌నాథ‌న్‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారిస్తున్న‌ది. అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను బుల్డోజ‌ర్ల‌తో కూల్చివేయ‌డాన్ని త‌ప్పుప‌డుతూ ఇటీవ‌ల సుప్రీంకోర్టు ప‌లుమార్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఈ విధానాన్ని గొప్ప‌గా చిత్రీక‌రించ‌డాన్ని కూడా అత్యున్న‌త న్యాయ‌స్థానం త‌ప్పుప‌ట్టింది. ఎన్నిక‌ల సంఘానికి కూడా వార్నింగ్ ఇచ్చింది. రోడ్లు, రైల్వే ట్రాక్‌లు, చెరువుల్లో జ‌రిగిన ఆక్ర‌మ‌ణ‌ల విష‌యంలో త‌మ తీర్పు వ‌ర్తించ‌ద‌ని కోర్టు చెప్పింది

.

 

Related News

Select the Topic
Scroll to Top