హైదరాబాద్ సెప్టెంబర్ 18 (ఈతరం భారతం); బుధవారం నగరంలో ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మనం ప్రపంచదేశాలతో పోటీ పడుతున్నామంటే మాజీ ప్రధాన మంత్రులు పీవీ, మన్మోహన్ సింగ్ లు తీసుకొచ్చిన సంస్కరణలేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీవీ ప్రధాని అయ్యాక పారిశ్రామిక విధానంలో మార్పులు తెచ్చారని కొనియాడారు.సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సృష్టించేందుకే ఈ పాలసీని తెచ్చినట్లు ఆయన చెప్పారు.పాలసీ లేకుండా ఏ ప్రభుత్వమూ నడవదని.. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకే ఈ పాలసీని తీసుకొస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఇన్సెంటివ్ హామీలను తాము నెరవేరుస్తామని సిఎం చెప్పారు.ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు కూడా పాల్గొన్నారు.















