ఈతరం భారతం ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా 18.9.24 : మండలంలోని కాచారం కైలాసపురంలోని శ్రీరేణుకా ఎల్లమ్మ తల్లి ఆశ్రమ పరిధిలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఆలేరు మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ అయినాల చైతన్యామహేందర్రెడ్డి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ నిర్వాహకులు, అర్చకులు, ఐవీఎఫ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ వంగపల్లి అంజయ్యస్వామి దంపతులు నూతన చైర్మన్ దంపతులకు అమ్మవారి చీర, పసుపుకుంకుమ, గాజులను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ రాష్ట్ర నాయకులు లెంకలపల్లి శ్రీనివాసులు, ఐవీఎఫ్ వాణిజ్య విభాగం అధ్యక్షులు కె చంద్రశేఖర్గుప్త, ఎడ్ల సుగుణ, రామ్‌రెడ్డి, కాచారం వాసవి క్లబ్ అధ్యక్షులు ఆకుల రమేశ్, ఐవీఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి రమేష్, ఐవీఎఫ్ తుర్కపల్లి అధ్యక్షులు ఎల్లా కనకయ్యరాజు, తిరుమలాపురం మాజీ ఉపసర్పచ్ సముద్రాల వెంకటేశ్, సాల్వేరు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.















