మేడ్చల్ సెప్టెంబర్ 20 (ఈతరం భారతం); ఆది లీలా ఫౌండేషన్,మ్యాగ్నేస్ డయాగ్నస్టిక్స్, మాతృదేవోభవ సత్సంగ్, సంఘమిత్ర దివ్యాంగుల సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర దివ్యాంగుల కాలనీలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరాన్ని ఆదిలీల ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆదినారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బిపి, షుగర్ పరీక్షలతో పాటు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.. శిబిరానికి కాలనీకి చెందిన సుమారు 300 మంది మహిళలు పురుషులు హాజరై వైద్య పరిక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సుఖశాంతులతో జీవించగలాలన్న ఏలాంటి రోగాలబారిన పడకుదన్నారు. ముఖ్యంగా బీపీ షుగర్ మూలంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. మితా ఆహారంతో సమయపాలన పాటించి ఆహార అలవాట్లను పాటించినట్లయితే ఎలాంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంతో ఉండగలరన్నారు అలాంటప్పుడు వైద్యుల అవసరం కూడా ఉండదన్నారు. దీనిలో డాక్టర్ సింగం శ్రీనివాస్ రావు మేనేజింగ్ డైరెక్టర్ మేగ్నిస్ డయాగ్నొస్టిక్ వారు మాట్లాడుతూ ఇ రోజు వరకు 1040 ఉచిత వైద్య శిబిరాలు చేశాం ఇలాగే మన కీసర మండలం లో అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం అని చెప్పారు. డాక్టర్ ఆదినారాయణ ఆదిలీల ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ ఇలా కాంప్స్ కండక్ట్ చేయడం చాలా సంతోషకరంగా ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం వలన ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో క్యాంప్లు కండక్ట్ చేస్తామని చెప్పారు.మ్యాగ్నస్ డయాగ్నసిస్ సెంటర్ డాక్టర్ శ్రీనివాస్ రావు , డాక్టర్ జగన్మోహన్రావు నేతృత్వంలో వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాతృదేవోభవ సత్సంగ్ అధ్యక్షులు కేబీ శ్రీధర్ ,సంఘమిత్ర సంఘం అధ్యక్షులు ఎస్ఎస్ ఉదయలక్ష్మి, ఆది లీల ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీవాణి, దమ్మైగూడ మున్సిపల్ కౌన్సిలర్ వెంకటేష్, భువనగిరి కాంటెస్ట్ ఎంపీ నామని భాస్కర్ ,స్థానిక సీఐ వెంకటయ్య, సంఘమిత్ర సంస్థ ప్రధాన కార్యదర్శి అల్లాజీ, శ్రీ సాయి యువశక్తి ఫౌండేషన్ నిశాంత్ రెడ్డి ,కాలనీ ప్రెసిడెంట్ చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు















