EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తెలంగాణ క్రీడాభివృద్ధికి సహకరించండి  ఖేలో ఇండియా నిధులు అధికంగా కేటాయించండి  స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్ సెప్టెంబర్ 21 (ఈతరం భారతం); తెలంగాణ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేన రెడ్డి కేంద్ర యువజన క్రీడల శాఖ మంత్రిమన్ సుఖ్ మాండ్వియా కోరారు. నిన్న హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రికి ఒక వినతి పత్రం సమర్పించారు. నైపుణ్యాల నేల తెలంగాణకు ఘనమైన క్రీడా చరిత్ర ఉందని ప్రతిష్టాత్మక ఒలంపిక్స్ తో పాటు జాతీయ అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ లలో రాణించిన అనేకమంది క్రీడాకారులను తెలంగాణ ఉత్పత్తి చేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రామాణిక స్విమ్మింగ్ పూల్స్ బహుళర్ధసార్థక ఇండోర్ స్టేడియంలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ షూటింగ్ రెయిన్ హాకీటర్ సైక్లింగ్ వేలోడ్రం, టెన్నిస్ కాంప్లెక్స్, ఫుట్ బాల్ మైదానాలు స్కేటింగ్ ట్రాక్స్, వాటర్ స్పోర్ట్స్ క్రీడా సౌకర్యాలు కలిగిన గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం,ఎల్ బి స్టేడియం కే వి బి ఆర్ ఇండోర్ స్టేడియం, జింఖానా గ్రౌండ్స్ తోపాటు హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో పోటీల నిర్వహణకు అత్యంత సౌకర్యంగా ఉంటుందని భవిష్యత్తులో జరిగే ఒలంపిక్స్ ఆసియా క్రీడలు కామన్వెల్త్ క్రీడలు తోపాటు వివిధ ప్రపంచ ఛాంపియన్ షిప్ , ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మరియు ఆసియా నిర్వహించడానికి తెలంగాణకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో యువ క్రీడా ప్రతిభను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఇందు కొరకు కేంద్ర ఆర్థిక సాయం అందించాలని ఆ లేఖలో అభ్యర్థించారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో క్రీడా సౌకర్యాల అభివృద్ధికి మల్లికా సదుపాయాల మెరుగుదల కొరకు ఖేలో ఇండియా పథకం కింద నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా మార్చాలని ఆకాంక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top