EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గాంధీభవన్‌లో స్వదేశీ మేళా

ఈతరం భారతం హైదరాబాద్ జూలై 13 :హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వేదికగా గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న వారోత్సవాలు, సుస్థిర విజ్ఞాన సదస్సు, స్వదేశీ మేళా కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది.ఈ సదస్సులో తెలంగాణ డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్, కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ పాల్గొన్నారు. సదస్సు ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను స్మరించుకున్నారు. అయితే కాగా నేటి తరానికి ఆయన సిద్ధాంతాలను చేరువ చేసే దిశగా ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా, చౌటుప్పల్ ట్రినిటీ విద్యాసంస్థల విద్యార్థులు మహాత్మా గాంధీ వేషధారణలో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. గాంధీజీ బోధించిన స్వదేశీ భావనలు, సుస్థిర జీవనం  ప్రాముఖ్యతను ఈ సదస్సు చాటిచెప్పింది.

Related News

Select the Topic
Scroll to Top