EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి

ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 20

__________________________________

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని ఆదివారం 80 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వ రంగాలకు చెందిన 80 బీసీ ఉద్యోగ సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షునిగా దానకరుణా చారిని సమావేశంలో ఎన్నుకున్నారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ

విద్యా ఉద్యోగ నియా మకాల్లో బీసీ రిజర్వేషన్లపై క్రిమిలేయర్ విధించిన తీరు బీసీలపై వివక్ష చిన్నచూపు చూస్తున్నట్లు స్పష్టమవుతుందన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేసారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే కులగణలో లో ఓబిసి కాలామ్ పెట్టి ప్రతి కులానికి కోడ్ నెంబర్ ఇవ్వాలని, కేంద్ర విద్య ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా ప్రకారం 27% నుంచి 55 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. బీసీల విద్యా ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమినయ్యర్ను తొలగించాలని సమావేశం డిమాండ్ చేసింది ఈ సమావేశంలో జేఏసీ అధ్యక్షునిగా వి .దానకర్ణ చారి ప్రధాన కార్యదర్శిగా ఎస్. రవికుమార్, కోశాధికారిగా రామ్ రాజ్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రమణ మూర్తి, చైర్మన్ గా యు. చెన్నయ్య ,వైస్ చైర్మన్ గా శ్రీనివాస్ గౌడ్, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఏ . ప్రదీప్ తోపాటు అల్ ఇండియా బంక్ ఉద్యోగుల సంఘం తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్య దర్శి అల్లం యాదయ్య, నాగమోహన్, శైలేష్, గౌతమ్, ఏ .లక్ష్మణ్ జి, శిరీష ,శ్రీశైలం గౌడ్,లతోపాటు ఆయా సంస్థల ఉద్యోగ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు నాయకులు హాజరైనారు.

Related News

Select the Topic
Scroll to Top