ఈతరం భారతం ఖమ్మం జూలై 13 :స్థానిక 47వ డివిజన్లో ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆషాడ బోనాలు సమర్పించే దిశగా ఈరోజు 46,47 48వ డివిజన్ లొ ని ప్రజలు అందరూ కలిసి 48 డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు గార్ల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు జరిపించి ఇంటి నుంచి బోనాలు ఎత్తుకొని డప్పు మేళాలతో, ఊరేగింపుగా వందలాది మందిరితో ఆ అమ్మవారీ కనకదుర్గమ్మ ఆలయంలో బోనాలు సమర్పించడం జరిగింది.
ఈ పండుగ సంబరాలను ఉద్దేశించి మాట్లాడుతూ అమ్మవారి కృపాకటాక్షములు మాకు, కుటుంబ సమానులైన మా డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో మేము చల్లగా ఉండాలని కోరడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని ఈ సందర్భంగా వారు కోరినారు. ఈ కార్యక్రమంలో46 డివిజన్ కార్పొరేటర్ మాటేటి నాగేశ్వరరావు, మాటేటి కిరణ్, మరియు తోట రమేష్ కుమార్, డాక్టర్ లక్ష్మణ్ కుమార్, నిమ్మల నవీన్, ఆకుల సత్యం, మల్లెల నాగేశ్వరరావు, మట్టి కిరణ్, నడిగుప్పుల సత్యనారాయణ, నాగేశ్వరరావు, బింగి రవి, రాము, వీరేశం, మాస్ మహేష్, వీరేందర్. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ బోనాల పండుగలో పాల్గొన్న ప్రజలందరికీ తోట గోవిందమ్మ రామారావు దంపతులు ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినారు















