హైదరాబాద్ జూలై 14(ఈతరం భారతం);సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతతో తెలంగాణ క్రీడారంగా ముఖచిత్రం పూర్తి గా మారిపోయిందని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేన రెడ్డి అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గాపదవి బాధ్యతలు చేపట్టిన ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,స్పోర్ట్స్ అథారిటీ ద్వారా చేపట్టిననిరంతర క్రీడా కార్యక్రమాలు తెలంగాణ క్రీడారంగము లో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని అన్నారు.















