EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కాంగ్రెస్ గ్లోబల్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి: మంత్రి హరీష్ రావు

నెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌ లో బీఅర్ఎస్ పార్టీ నేతలు కీలక సమావేశం అయ్యారు. ఈ భేటీలో మంత్రి హరీష్ రావు ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీ నియోజకవర్గాల ఎన్నికల ఇన్చార్జిలు, వార్ రూం ఇన్చార్జిలు పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, మేనిఫేస్టో ను ఇంటింటికి తీసుకెళ్ళె అంశంపై మంత్రి హరీష్ రావు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని, వాటిని తిప్పి కొట్టాలని నేతలకు సూచించారు. మూడోవ సారీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారంలోకి రాబోతున్నారని అన్ని సర్వేలు చెప్తున్నాయన్నారు. నేతలందరూ సీరియస్‌గా నెల రోజులు కష్ట పడాలని, అవసరం అయితే ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ రాత్రుళ్లు కూడా నేతలు పడుకోవాలని సూచించారు. ఒక ప్లాన్ ప్రకారం అందరూ ముందుకు వెళ్లాలన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలముందుకు బలంగా తీసుకు పోవడంలో  కొంత వెనుక బడుతున్నామన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top