EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నిమిష ప్రియ కేసు.. అసలు బ్లడ్ మనీ అంటే ఏంటి ?

ఈతరం భారతం హైదరాబాద్ జూలై 15 : నిమిష ప్రియ కేసు.. అసలు బ్లడ్ మనీ అంటే ఏంటి ?బ్లడ్ మనీ అంటే ఇస్లామిక్ షరియా చట్టంలో దియా అని పిలిచే ఒక ఆర్థిక పరిహార విధానం. ఇది యెమెన్ వంటి షరియా చట్టాలను అనుసరించే దేశాల్లో అమలులో ఉంది. దీని ప్రకారం హత్య లేదా గాయపరిచిన నేరంలో నిందితులైనవారు.. బాధితుడి కుటుంబానికి లేదా అతనికి ఆర్థిక పరిహారం చెల్లించి వారి నుంచి క్షమాభిక్ష పొందితే శిక్ష నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. బాధిత కుటుంబం ఈ పరిహారాన్ని అంగీకరిస్తే నిందితుడిని క్షమించి ఉరిశిక్ష వంటి కఠిన శిక్షల నుంచి విముక్తి చేయవచ్చు. ఈ విధానం షరియా చట్టంలో క్షమాగుణాన్ని ప్రోత్సహించేందుకు రూపొందించారు. నిమిష ప్రియ కేసులో బ్లడ్ మనీ రూ. 8.6కోట్లుగా నిర్ణయించారు. ఒక వేళ వారి కుటుంబం పరిహారాన్ని తిరస్కరిస్తే.. యెమెన్ చట్టాల ప్రకారం శిక్షను యథావిధిగా అమలు చేస్తారు.

యెమెన్ లో ప్రస్తుతం రెండు సమాంతర ప్రభుత్వాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ అండ్ హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలోని సుప్రీం పొలిటికల్ కౌన్సిల్. నిమిషప్రియ సనా సెంట్రల్ జైల్లో ఉండగా.. ప్రస్తుతం అది హౌతీల నియంత్రణలో ఉంది.

Related News

Select the Topic
Scroll to Top