ఈతరం భారతం యాదాద్రి భువనగిరి జిల్లా జూలై 15 : జిల్లా పరిధిలోని ఆలేరు నియోజక వర్గం కాచారం (కైలాసపురం)శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో ఆషాడమాసం మూడవ మంగళవారం పురస్కరించుకొని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు . ముఖ్యఅతిథిలుగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్బా చంద్రశేఖర్ గుప్తా , హైదరాబాద్ ఉప్పల్ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ నాగులూరి సుజాత అశోక్ దంపతులు హాజరైన పూజా కార్యక్రమాల్లో బాన్సువాడ పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సాయి స్వరూప్ ఇండస్ట్రీస్ (బిర్కూర్) అధినేత కే హనుమాన్లు పద్మ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిమాన్వితమైన శ్రీ కాచారం రేణుక ఎల్లమ్మ తల్లిని ఆషాడ మాసంలో దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పారు. గత మూడు దశాబ్దాలుగా అమ్మవారి సేవలో నిమగ్నమైన ఆలయ వ్యవస్థాపకులు అంజయ్య స్వామికి వారు అభినందనలు తెలిపారు. ఈనెల 29న జరగబోయే నాగుల పంచమి బోనాల పండుగ శ్రీశ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానంతరం ఐ వి ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త స్వప్న దంపతుల ఆదేశాల మేరకు ఈనెల 29వ తేదీన నాగుల పంచమి సందర్భంగా జరగబోయే శ్రీశ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం, బోనాల పండుగ మహోత్సవ బ్రోచర్లను ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్ గుప్త చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐ వి ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జులగంటి అశోక్ గుప్త, ఈసీఐఎల్ రేణికుంట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్త, హైదరాబాదుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వై నరేందర్ రెడ్డి సరిత దంపతులు, ఈసీఐఎల్ కు చెందిన వేముల ప్రభాకర్ గౌడ్ – పుష్పలత, ధర్మేంద్ర చారి – స్వప్న దంపతులు, ఉప్పల ప్రవీణ్ కళ్యాణి దంపతులు, దుప్పల దేషారెడ్డి రజిత దంపతులు , మార్కండేయ కమిటీ సభ్యులు పార్వతీ సోమరాజులు, రఘునాథ పుర వాస్తవ్యులు బెజ్జాల విశ్వనాథం గుప్తా, చంద్రశేఖర్, గిరిపల్లి వాస్తవ్యులు పడకంటి శ్రీనివాస్ గుప్తా, కుమారుడు ప్రేమ్ కుమార్ , యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంకి చెందిన ఐవిఎఫ్ నాయకులు లెన్కలపల్లి శ్రీనివాస్ ఉప్పగల నరసింహులు , వుప్పగల శ్రీనివాస్ వి హరికృష్ణ , శ్రీ సాయి జూనియర్స్ అధినేతలు విష్ణు , రఘునాథం ,సినీ నిర్మాత సామా శ్రీధర్ ప్రశాంతి దంపతులు పాల్గొన్నారు.















