ఈతరం భారతం తిరుపతి, సెప్టెంబర్ 19 రిపోర్టర్ మనోజ్ కుమార్
___________________________________________________
స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాధ్యమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. స్వచ్ఛత అనేది పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత మాత్రమే కాదని ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన గుర్తు చేశారు. స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా శనివారం ఉదయం ఎన్జీవో కాలనీలోని మాల్వాడిగుండం కాలువను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కార్పొరేషన్ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు కలిసి శుభ్రం చేసి, మొక్కలు నాటారు. స్వచ్ఛత ఉన్న చోటే ఆరోగ్యం ఉంటుందని ఆరోగ్యం ఉన్న చోటే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. అభివృద్ధి సాధిస్తేనే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, యువ నాయకులు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ల లక్ష్యమైన స్వర్ణాంధ్ర సాధ్యమని ఆయన చెప్పారు. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, మన వీధిని, మన కాలనీని, మన నగరాన్ని కూడా అంతే బాధ్యతతో పరిశుభ్రంగా ప్రతి ఒక్కరూ ఉంచుకోవాలని ఆయన కోరారు. నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి, సుందర నగరంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని అన్నారు.
చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు ప్రజలు అందించాలని ఆయన కోరారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పరిశుభ్ర నగరంగా తిరుపతిని నిలపడంలో యువత కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. పరిసరాల పరిశుభ్రతకు కట్టుబడి ఉంటామని అందరి చేత కమిషనర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, టీటిడి బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్, ఇంచార్జి జె.బి. శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, మాజీ కార్పొరేటర్ అన్నా అనిత, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, ఎన్ సిసి కాడేట్లు తదితరులు పాల్గొన్నారు.















