ఈతరం భారతం ఖమ్మం జూలై 16 : అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో హలో విద్యార్థి.. చలో కలెక్టరేట్.. నినాదంతో ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంను ముట్టడించారు.రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్, పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పలువురు విద్యార్థినిలు స్టీల్ గిన్నెతో భిక్షాటన చేస్తూ, స్కాలర్షిప్ రియంబర్స్మెంట్, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.















