హిందూ ధర్మం సాధించిన విజయాలు హైలెట్ చేయాలి..
ఇండియా పదాన్ని తొలగించడమే కాకుండా.. హిందూ ధర్మం సాధించిన విజయాలు హైలెట్ చేయాలని సిఫారసు చేయడం మరింత వివాదానికి దారి తీసింది. పుస్తకాల్లో ఓల్డ్ హిస్టరీకి బదులు.. క్లాసికల్ చరిత్ర ప్రవేశపెట్టాలని కమిటీ సిఫారుసు చేసింది. బ్రిటిష్ వారి మరకల్ని శాశ్వతంగా దూరం చేయడానికే పేర్లు మారుస్తున్నట్లు ఇన్సాక్ తెలిపారు. అన్ని పాఠ్యాంశాల్లో భారతీయ నాలెడ్జ్ సిస్టమ్ ప్రవేశపెట్టాలని కూడా కమిటీ సిఫారుసు చేసింది. అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటములకు తాజా ఘటన మరో రాజకీయ అస్త్రం అయింది.
















