తెలంగాణాసంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే అలయ్‌బలయ్ కార్యక్రమం ఈ సంవత్సరం కూడ ఘనంగా జరిగింది. హర్యానా గవర్నర్ బండారు దత్తత్రేయ కుమార్తె విజయలక్ష్మి అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి , ఎంపీ లక్ష్మణ్ మిజోరం గవర్నర్ హరిబాబు , రాష్ట్ర మంత్రి తలసానిశ్రీనివాసయాదవ్, ఆచార్యకోదండరామ్, కాంగ్రెస్ నేత హనుమంత్ రావ్ రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు రాజ్ గోపాల్ రెడ్డి లతో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు
.















