EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పాన్‌’ లేకుండా నగదు బట్వాడా.. బ్యాంకులకు కొత్త నిబంధన

పాన్‌కార్డు లేని వారి నుంచి, స్వీయ వివరాలు సేకరించిన తర్వాతే నగదు పరివర్తనకు అనుమతించాలని బ్యాంకులకు ఆదాయపన్ను శాఖ తెలియజేసింది. ఒకసారి రూ.50 వేలు, అంతకు పైగా నగదు పరివర్తన చేపట్టే వారి నుంచి పాన్‌ కార్డు నెంబరు స్వీకరించి బ్యాంకు ఉద్యోగులు నగదు బట్వాడా చేపడుతున్నారు. అదే సమయంలో రూ.50 వేలకు పైగా నేరుగా నగదు బట్వాడా చేయవద్దనే ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. ఈ క్రమంలో, పలు బ్యాంకులు తమ వినియోగదారుల నుంచి పాన్‌ లేకుండా రూ.50 వేలకు పైగా నగదు నేరుగా బట్వాడా చేస్తున్నాయి. ఈ విషయంపై దృష్టి సారించిన ఆదాయపన్ను శాఖ, పాన్‌ లేని వినియోగదారుల ఆధార్‌ నెంబరు, బ్యాంక్‌ ఖాతా నెంబరు, చిరునామా, రిజిస్టర్‌ మొబైల్‌ నెంబరు తదితర స్వీయ వివరాలు సేకరించిన తర్వాతే నేరుగా నగదు బట్వాడాకు అనుమతించవచ్చని పేర్కొంది.

Related News

Select the Topic
Scroll to Top