“ఎన్నికల్లో ఓటు వేసే ముందు రాష్ట్ర భవిషత్తును చూసి వేయండి. నేను చంద్రబాబు నుంచి క్రమశిక్షణ, ఓర్పు, ఎన్టీఆర్ నుంచి పౌరుషం ఈ రెండు నన్ను అన్ని పరిస్థితుల్లో ముందుకు తీసుకుపోతోంది. చంద్రబాబు దసరా శుభాకాంక్షలు చెపుతూ రాసిన లేఖపై ఈ ప్రభుత్వం విచారణ చేస్తుందట. ప్రభుత్వం సమయం ఎంతో విలువైనది. వర్షాలు లేదు. ఈ పరిస్థితుల్లో రైతులకు ఏం చేయాలని చూడాలి. ఇలా లేఖ గురించి విచారణ పేరుతో సమయం వృధా చేయటం పిచ్చి ఆలోచన మాత్రమే. పంపుతున్న భోజనాల గురించి వారి మాటలను చూస్తే… పని లేని వారి గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు అనిపిస్తుంది. మీ బిడ్డలు మీకు విషం కలిపి ఇస్తారా?. రాజకీయ నేతను పెళ్లి చేసుకుని నేను మాత్రం చాలా నేర్చుకున్నాను. ప్రతి మహిళ తనపైన తనకు నమ్మకం ఉంచాలి. తను ఏది సరైన దారి అనుకుంటారో దాన్ని గుర్తించాలి.” అని భువనేశ్వరి అన్నారు.
















