EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పిరమిడ్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం అబ్యర్థిగా కోవూరి సత్యనారాయణ గౌడ్

పిరమిడ్ పార్టీ సంగారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గం అబ్యర్థిగా కోవూరి సత్యనారాయణ గౌడ్ ఎంపి కైనారు.ఈ మేరకు ఆపార్టీ రాష్ట్ర కార్యాలయం లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ఆనంద్ ప్రసాద్ చేతులమీదుగా ప్రముఖ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ బీఫామ్ అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుండి, నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు బీఫామ్ అందజేశారు. ఈ సందర్బంగా జనరల్ సెక్రటరీ ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ సత్య ధర్మం పార్టీ పిరమిడ్ పార్టీ, అందరి పార్టీ పిరమిడ్ పార్టీ, ధ్యానుల పార్టీ, జ్ఞానుల పార్టీ, మేధావుల పార్టీ, పిరమిడ్ పార్టీ అని కొనియాడుతూ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ను సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు, నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలు , కవులు,కళాకారులు, మేధావులు, ధ్యానులు , జ్ఞాన, ధ్యాన మహిళామూర్తులు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించి సత్య ధర్మాన్ని కాపాడాలని కోరారు. అందుకు సంగారెడ్డి నియోజకవర్గంలో, నారాయణఖేడ్ నియోజకవర్గంలో, ప్రజలకు సేవ చేసుకోవడానికి, ధర్మాన్ని కాపాడడానికి, సత్యాన్ని నెలకొల్పడానికి, అవకాశం కల్పించిన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు ,స్వర్గీకృతులైన బ్రహ్మర్షి పత్రీజీ గారికి మరియు పిరమిడ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇట్టి తరుణంలో తన వంతు బాధ్యతగా అత్యధిక మెజారిటీతో గెలిచి చట్టసభల్లో అవినీతిని అంతం చేసే దశ దిశలో చట్టాలను ముందుకు తీసుకు వస్తానని తెలియజేశారు. ఈ సమావేశంలో కరాటే అశోక్ మాస్టర్, పిరమిడ్ మాస్టర్ నిర్మల, గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు శివమ్మ, బీసీ సంక్షేమ సంఘం రక్షక్ దళ్ చైర్మన్ ఉదయ్ కుమార్ నేత, బీసీ సంఘం నాయకులు పులి సాయికిరణ్ గౌడ్, మరియు యువకులు ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top