ఈతరంభారతం ఆగస్టు 25 యాదాద్రి భువనగిరి : జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో సోమవారం మట్టి వినాయకుల పంపిణీ ముమ్మరంగా జరిగింది. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి సొంత ఖర్చులతో పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడాలని ఒక మంచి ఉద్దేశంతో గత పది సంవత్సరాల నుండి మట్టి వినాయకులను జిల్లా మొత్తం కొన్ని వేల విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఆలేరు మున్సిపల్ పరిధిలోని ప్రముఖులకు వినాయక విగ్రహాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు సరాబు సంతోష్ కుమార్, ధార్మిక పరిషత్ జిల్లా అధ్యక్షులు సరాబు లక్ష్మణ్, ఆలేరు వైశ్య సంఘం జనరల్ సెక్రెటరీ సముద్రాల రవి , బెల్దే కాశి, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్, మంగ నరసింహులు, షకీలా రవి, ఎర్రం భాస్కర్ పాల్గొన్నారు.















