ఈతరం భారతం ఖమ్మం, సెప్టెంబర్ 19:రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
_______________________________________________________________
తెలుగు భాషా సంస్కృతుల గొప్పతనాన్ని, విశిష్టతను సుదూర అమెరికా గడ్డపై చాటిచెప్పి ఖమ్మం జిల్లా కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ కవి, రచయిత మంత్రిప్రగడ శ్రీనివాసరావును తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా టి డబ్ల్యూ జి ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఖదీర్ మాట్లాడుతూ… ఖమ్మం మట్టిలో పుట్టిన శ్రీనివాసరావు అమెరికాలో నిర్వహించిన భాషా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తెలుగు వెలుగులను నలుదిశలా వ్యాపింపజేశారని కొనియాడారు. పరాయి దేశంలోనూ సొంత భాషపై ప్రేమను చాటుతూ, తెలుగు సాంప్రదాయాల గౌరవాన్ని నిలబెట్టడం ప్రతి ఒక్క ఖమ్మం వాసికీ గర్వకారణమని పేర్కొన్నారు. జర్నలిజం రంగానికి, సాహితీ రంగానికి ఆయన అందించిన, అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.
అనంతరం మంత్రిప్రగడ శ్రీనివాసరావును , శాలువాతో కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సత్కారానికి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలుపుతూ, మాతృభాష ప్రాశాస్త్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు.
టిడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు సయ్యద్ ఖదీర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అభినందన సభకు యూనియన్ ఉపాధ్యక్షులు దువ్వాసాగర్ అధ్యక్షత వహించారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు నలుబోల మధుశ్రీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంతోష్ చక్రవర్తి, జిల్లా కమిటీ సభ్యులు షేక్ జానీ పాషా, గరిడేపల్లి వెంకటేశ్వర్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దగ్గుపాటి మాధవరావు,ప్రధాన కార్యదర్శి కోరకొప్పుల రాంబాబు, ఫెడరేషన్ నాయకులు యూసఫ్ పాషా, అక్రిడేషన్ కమిటీ మెంబర్ అర్షద్ ఖాన్, జర్నలిస్టులు ఎస్వీ రెడ్డి, రోషి రెడ్డి, మురళి పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు















