ఈ తరం భారతం హైదరాబాద్, ఆగస్టు 25: ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న ఆశ వర్కర్లకు మాజీ మంత్రి హరీష్ రావు సంఘీభావం ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే పోలీసులు లేకుండా ఓయూకి వెళూ అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని గుర్తు చేశారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి .. ఓయూకి వస్తే విద్యార్థులు ఇయ్యర మయ్యర అందుకున్నారని వివరించారు. అప్పుడు సందులో పడి రేవంత్ రెడ్డి ఉరికాడని చెప్పారు. కానీ ఇప్పుడు.. తాను ఓయూకు వచ్చానని అంటున్నాడన్నారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఓయూ సాక్షిగా క్షమాపణలు చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు.ఎప్పటి లోగా విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తావో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.















