EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

టేబుల్ టెన్నిస్ లో ” విహాన్ ” వీరవిహారం బాలుర అండర్ _11లో విహాన్ కు స్టేట్ టైటిల్

హైదరాబాదు/ యాదగిరిగుట్ట, ఆగస్టు 25 (ఈ తరం భారతం );: విహాన్ అంటే సూర్యోదయం.. పేరుకు తగ్గట్టుగానే టేబుల్ టెన్నిస్ క్రీడలో తలుక్కున మెరిశాడు విహాన్..రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టిటి) పోటీలు హైద్రాబాద్ లోని ఎల్బి స్టేడియంలో జరుగుతున్నాయి. బాలుర అండర్ _11 విభాగంలో విహాన్( ఐటీ టిఐ) విజేతగా నిలిచాడు. ఫైనల్లో11_7, 11_5, 11_8 స్కోర్ తో శుభం డే (ఎ వి ఎస్ సి) పై విజయం సాధించి టైటిల్ గెలుచుకున్నాడు.ముడుంబై కౌముది _గోపిల ఏకైక కుమారుడు చి. విహాన్. ఐదవ తరగతి. పల్లవి మోడల్ పాఠశాలలో చదువుతు న్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడైతే విద్యత్ తో పాటు క్రీడల్లో కూడా పిల్లలు అత్యంత ప్రతిభావంతులుగా రాణిస్తారు అనడానికి ఉదాహరణగా విహాన్ నిలుస్తున్నాడు. తొమ్మిదేళ్ళ ప్రాయంలో తండ్రి ప్రోత్సాహం సమృద్ధిగా లభించడంతో టేబుల్ టెన్నిస్ క్రీడలో ఆసక్తి పెంచుకున్నాడు. అంచెలంచలుగా ఎదుగుతూ ఇప్పటివరకు ఏడు రాష్ట్రాల్లో క్రీడా పోటీల్లో పాల్గొన్నాడు . తెలంగాణ రాష్ట్రంలో నాలుగు సార్లు ఆడి ..టైమ్స్ స్టేట్ ర్యాంక్ అవార్డ్స్ తీసుకున్నాడు. అంతే కాకుండా అవకాశం వస్తే చాలు 13, 15.సం. గ్రూపులో కూడా ఆడుతున్నాడు. టేబుల్ టెన్నిస్ లో రాష్ట్ర.. జాతీయ క్రీడల్లో ఒక అత్యుత్తమ క్రీడాకారునిగా ఎదుగుతున్న క్రీడానైపుణ్యం విహాన్ లో కనిపిస్తోంది..

 

 

Related News

Select the Topic
Scroll to Top