ఈతరం భారతం ఆగస్టు 26 హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి సంబరాలకు సన్నద్ధమైంది. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరు వాడంత సంబరాలే, తొమ్మిది రోజులపాటు గణేష్ మండపంలో ఊరు వాడ లో గణపతి బప్పా మోరియా అనే నినాదాల తో మారుమోగుతాయి.వినాయక చవితిని పురస్క రించుకుని బుధవారం నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు గణపతి నవరాత్రోత్స వాలు ఘనంగా నిర్వహిస్తా రు. హిందువులు జరుపుకునే పండగలలో వినాయక చవితి పండగకు విశిష్ట స్థానం ఉంది. పిల్లలు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండగ. పెద్దలు పిల్లలుగా మారే పండగ. దేశ వ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. వినాయక పుట్టిన రోజైన బాద్రపద మాసం శుక్ల పక్షం చవితితిథి నుంచి 9 రోజుల పాటు గణపతిని పుజిస్తారు. ఇప్పటికే గల్లీ గల్లీలో గణపతి నవరాత్రి వేడుకల కోసం మండపా లను రెడీ చేస్తున్నారు.
తెలంగాణ లో గణపతి వినాయక చవితి పండగ అంటే ఆబాల గోపాలం కోలాహాలంగా జరుపుకోవ డానికి రెడీ అవుతారు. ఇప్పటికే ఈ పండగ సందడి మొదలైంది. గల్లీ గల్లీ లో గణపతి మండపాలు వెలిశాయి. చవితికి వారం రోజులున్నా బొజ్జ గణప య్య భక్తుల హడావిడి మొదలైంది.















