ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్టు 27 :తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రాష్ట్రంలో భారీ వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. అలాగే ఉరుములు, మెరుపులు ఈదురుగాలులు గాలివేగం గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో కూడిన వర్షాలు కురుస్తాయని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు, ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.















