ఈతరం భారతం ఆగస్టు 27 యాదాద్రి భువనగిరి:
ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ చాముండేశ్వరి నగర్ లో ప్రాచీన ఆలయమైన శ్రీ చాముండేశ్వర సంతోషిమాత సన్నిధిలో బుధవారం వినాయక చవితి సందర్భంగా మహాగణపతి హోమం అత్యంత వైభవంగా జరిగింది. గణేష్ నవరాత్రులను కూడా ఆలయ ప్రాంగణంలో ప్రారంభించారు. గణపతి నవరాత్రి పూజలను ఆలయ అర్చకులు ముల్లకల్ రఘునాథన్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు.















