దారికి అడ్డుగా ఉన్న కారును పక్కకు తొలగించాలని హారన్ కొట్టినందుకు ఆర్టీసీ డ్రైవర్ బ త్తుల రాంసింగ్ పై దాడిచేసిన వారిపై ఖటిన చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ జన సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.ఈ సందర్బంగా నరసారావు పేట లో ఏర్పాటు చేసిన సమావేశం లో సంఘం అధ్యక్షులు కే .బాలాజీ సింగ్ ,జాతీయ మహిళా అధ్యక్షురాలు క్షత్రి పండరి బాయి ,జాతీయ యువజన అధ్యక్షులు కత్రి గణేష్ సింగ్ లు మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్ బ త్తుల రాంసింగ్ పై 19మంది దాడిచేసి గాయపరిచారన్నారు.కావలిలోని టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా మలుపు తిరుగుతున్న కారును పక్కకు పొమ్మని ఆర్టీసీ డైవర్ బస్సు హారన్ కొట్టారు. దీంతో కారులో ఉన్న వ్యక్తులు బస్సుకు అడ్డంగా కారు ఆపి, డ్రైవర్ను కొట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమీపంలో అక్కడున్న పోలీసులు, స్థానికులు అడ్డుకుని సర్దుబాటు చేసి పంపారు. దీంతో ఆ కారులో ఉన్న వ్యక్తులు ఎవరికో ఫోన్ చేయగా టాటాసుమోలో సుమారు 14 మంది వచ్చారు. రెండు వాహనాలు కూడా ఆర్టీసీ బస్సును వెంబడించినట్లు వారు పేర్కొన్నారు.మద్దూరుపాడు వద్దకు వెళ్లేసరికి బస్సుకు అడ్డంగా వాహనాలు పెట్టారు. బస్సు ఆపి డ్రైవర్ను కిందకు లాగి రోడ్డుపై పడేసి కొట్టారు. ఆ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు వారి ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా వారి ఫోన్లు కూడా లాక్కొని, కింద పడిపోయిన డ్రైవర్ను వదిలేసి వెళ్లిపోయారు. 108 వాహనానికి ఫోన్ చేయగా ఆ వాహనంలో డ్రైవర్ను ఏరియా వైద్యశాలకు తరలించి వైద్యసేవలు అందించారు. ఈ దాడిని జాతీయ బీసీ జన సంక్షేమ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కమల బాయి ,రాష్ట్ర అధ్యక్షురాలు తులసి బాయి ,పల్నాడు జిల్లా అధ్యక్షురాలు వనిత బాయి ,మహా రాణా ప్రతాప్ సింగ్ బొందిలి అన్నదాన సమాజ్ అధ్యక్షులు క్షత్రి విజయ్ ప్రతాప్ సింగ్ ,సెక్రెటరీ క్షత్రి బాబీ సింగ్ ,ట్రెజరర్ బొందిలి రామ్ బాలాజీ సింగ్ ,మెంబర్స్ సాంబ సింగ్ ,చిన్న హనుమాన్ సింగ్ ,వీరాంజి సింగ్ ,రాణా ప్రతాప్ సింగ్ ,హనుమాన్ సింగ్ ,రాంసింగ్ ,ప్రియా సింగ్ ,రీనా ,సరిత ,అంజలి ,తదితరులు తీవ్రంగా ఖండించారు.