హైదరాబాద్ నగరం లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న హెచ్‌ఎండీ నసీర్ భారతీయ రిపబ్లికన్ పార్టీ (ఆర్పిఐ) లో చేరారు.సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం లో ఆర్పిఐ పార్టీ రాష్ట్ర అద్యక్షులు ఏ.వి.స్వామి సమక్షంలో నసీర్ పార్టీ లో చేరారు.ఆయనకు స్వామి పార్టీ కండువాను కప్పి పార్టీ లోకి ఆహవనించారు.అనంతరం హెచ్‌ఎండీ నసీర్ మీడియా తో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రాంతం రిచ్ ప్రాంతం ఐనప్పటికీ ఈ ప్రాంతం లో కుడా అనేకమంది నిరుపేదలు జేవిస్తున్నారని అన్నారు అలాంటివారిని గుర్తించి రాజ్యాంగబద్దంగా వారి హక్కులను కాపాడుతూ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరంగా రావలసిన పతకాలను కుల మతాలకు అతీతంగా వారికి అందే విదంగా కృషి చేస్తానన్నారు.త్వరలో జరుగబోయే ఎన్నికల్లో ప్రజలు తనకు ఓటు వేసి అత్యదిక మెజారిటి తో గెలిపిస్తారన్న ఆశాబావాన్ని వ్యక్తం చేసారు.