EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మేరా మిట్టి-మేరా దేశ్ ముగింపు ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ హుస్నాబాద్ పట్టణ, అక్కన్నపేట మండల అధ్యక్షులు

భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ  దేశ రక్షణ కోసం అసువులు బాసిన సైనికుల స్మారకర్థం దేశంలోని ప్రతి గ్రామం నుంచి మట్టీ సేకరించి, ఢిల్లీలో అమృతా వటికా నిర్మాణానికి పిలుపునివ్వగా, ఈ రోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో మేరా మాటీ – మేరా దేశ్ కార్యక్రమ ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ లో బీజేపీ నాయకులు సేకరించిన మట్టిని ఢిల్లీలోని అమృత కలశంలో వేయడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు.కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక శాఖ, ఈశాన్య రాష్ట్రాల మంత్రి  కిషన్ రెడ్డి  పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ ఉత్సవాలకు హుస్నాబాద్ నుంచి బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, అక్కన్నపేట మండల అధ్యక్షుడు గోళ్లపల్లి వీరాచారి గార్లు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top