EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అభివృద్దే మా ఎజెండా… సంక్షేమమే మా ధ్యేయం

మక్తల్ నియోజకవర్గం “అమరచింత మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో “సీఎం ఆశీర్వాద సభ సన్నాహక సమావేశం జరిగిబంది.ఈ సమావేశానికి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంఎల్ఏ చిట్టెం రామ్మోహన్ రెడ్డి తో కలిసి మక్తల్ నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరైనారు.ఈ సందర్బంగా డాక్టర్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ..ఎన్ని పార్టీల జెండాలు ఉన్న.. అమరచింత ప్రజలలో ఉన్నది రామ్మోహన్ రెడ్డి గారేనన్నారు.మక్తల్, అమరచింత బాగా ఉండాలనే.. రామ్మోహన్ రెడ్డి ఆశయ మన్నారు.రైతు బాగుంటే రాష్ట్రము బాగుటుందని.. అనేక సంక్షేమ పథకాలు తెచ్చిన ఘనత కెసిఆర్ దే నన్నారు.రైతు బంధు పథకం ద్వారా..73లక్షల మంది రైతులకు 85వేల కోట్లు అందించారని,చేతి కులవృత్తులుకు ఆర్థిక సహాయం చేసి.. కులవృత్తులను కాపాడిన ఘనత కెసిఆర్ గారే నని,చెరువులు కాపాడి 500కోట్ల చేప పిల్లలు వదిలితే.. నేడు ఆ సంపద 25వేల కోట్ల కి చేరింది అని తెలిపారు.5గంటలు కూడ కర్ణాటక లో కరెంటు ఇవ్వని.. డీకే శివకుమార్ కి ఇక్కడ మాట్లాడే అర్హత ఉందా?అని ప్రశ్నించారు.సూర్యుడు ని వేళాడదీసినట్టు.. విద్యుత్ కి 35వేల కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్ సిస్టంను సరిచేసి.. ప్రతి ఏడాది 10వేల కోట్ల ఖర్చు పెట్టి కరెంటు కష్టాలు తీర్చిన ఘనత కెసిఆర్ గాదే నన్నారు.గురుకులలా తో.. సబ్బండ వర్గాలను పిల్లలును ఉన్నత విద్యా,ఉద్యోగాలలో చూడాలనేదే కెసిఆర్ ద్యేయ మన్నారు.వృద్దులకు, దివ్యంగులకు.. డయాలసిస్ పెషేంట్ల వరకు.. అండగా నిలిచిన ఘనత కెసిఆర్ గారిదని,దశాబ్దాలుగా బీసీ లను మోసం చేసి.. ఇక్కడ వచ్చి బీసీ అభ్యర్థి గురుంచి మాట్లాడం హాస్యాస్పద మన్నారు.లోకల్, నాన్ లోకల్ గురుంచి మాట్లాడే నాయకులారా.. వయనాడ్ లో రాహుల్ గాంధీ లోకలా ?మంచి మనసున్న బిఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి గారిని భారీ మెజారిటీ తో గెలిపించాలన్నారు.క్లస్టర్, బూత్ ఇంచార్జ్ లు అంత.. సమన్వయం గా ఉండి.. గడప గడపకి వెళ్లి ఓటర్ల ని కలవాలని,కెసిఆర్ గారి సంక్షేమ పథకాలను వివరించి.. బిఆర్ఎస్ పార్టీ కి ఓటు ఒడిసి పట్టాలన్నారు.నవంబర్ 6న జరిగే సీఎం గారి సభ కి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని –ఆంజనేయ గౌడ్ గారు పిలుపు నిచ్చారు.

 

సబ్బండ వర్గాలను కడుపులో దాచుకున్న గొప్ప వ్యక్తి సీఎం కెసిఆర్

 

అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూఅమరచింతని మున్సిపాలిటీ చేసి ఎంతో అభివృద్ధి పరిచామన్నారు.పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, మైనార్టీ లకు షాదీ ముబారక్ ఇచ్చి.. మేనమామ గా నిలిచిన కెసిఆర్ తులకు రైతు బంధు, ఉచిత విద్యుత్,,రైతు భీమా కెసిఆర్ రైతు బాంధావుడు అయ్యారని తెలిపారు.కెసిఆర్ కిట్ నుండి.. అమ్మ ఒడి పథకం వరకు తల్లి బిడ్డల క్షేమం చూసాడని,సామజిక భద్రత కోసం ఆసరా లాంటి గొప్ప సంక్షేమ పథకాలు కెసిఆర్ ప్రవేశ పెట్టారన్నారు.హనుమంతుడు గుడి లేని ఊరు ఉండదు.. కెసిఆర్ సంక్షేమ పథకం అందని గడప ఉండదు అని తెలిపారు.ఉదయం పూట విద్యార్థులకి పౌష్టికహారం అందించాలని.. సీఎం అల్పాహారం పథకం ప్రవేశ పెట్టారని తెలిపారు.సబ్బండ వర్గాలను కడుపులో దాచుకున్న సీఎం దారి లో నడవాలని తెలిపారు.నూతన మ్యాని ఫెస్టోతో.. ప్రతి పక్షాల కళ్ళు భైర్లు కమ్మయాని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ కర్ణాటకని ఆగం చేస్తే .. కెసిఆర్ దేశంలో తెలంగాణ ని అగ్రపథంలో నిలబెట్టారు అని తెలిపారు.సీఎం సభకు అశేషం గా తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే సతీమణి రైతు సమన్వయ సమితి సభ్యురాలు సుచరిత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బిఆర్ఎస్వి ప్రెసిడెంట్ నరేష్ రెడ్డి, అమర చింత మండల బిఆర్ఎస్ అధ్యక్షులు రమేష్ ముదిరాజ్, రైతు సమన్వయ సమతి సభ్యులు ఆశి రెడ్డి, మున్సిపాల్ చైర్మన్ మంగమ్మ నాగభూషన్ గౌడ్ గారు,పుర పాలక సంఘం అధ్యక్షులు నరసింహులు గౌడ్ గారు,సీనియర్ బిఆర్ఎస్ నాయకులు, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, పార్టీ ప్రతినిధులు, వందలాది మంది కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top