ఈతరం భారతం ఖమ్మం, అక్టోబర్ -10:గ్రీస్ లో హాస్పిటాలిటీ, నిర్వహణ, సేవా రంగాలలో 1000 విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు సమర్పించాలని జిల్లా ఉపాధి అధికారి కే. శ్రీరామ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) ద్వారా గ్రీస్ లో హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా/డిగ్రీ కలిగిన వారికి, ప్రభుత్వ అనుమతితో నైపుణ్య ధృవీకరణ పొందిన అభ్యర్థులకు హాస్పిటాలిటీ, నిర్వహణ, సేవా రంగాలలో ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.అభ్యర్థులకు వేతనం 92 వేల నుంచి లక్షా 22 వేల రూపాయల వరకు అందుతుందని, గ్రీకు భాషలో పరిజ్ఞానం అవసరం లేదని, ఆంగ్ల భాష పరిజ్ఞానం తప్పనిసరి అని, ఉద్యోగదారునికి ఉచిత వసతి, భోజనం, భీమా కల్పించునున్నట్లు అదనపు పని గంటలకు ప్రతి గంటకు 20 శాతం అదనపు వేతనం అందించబడుతుందని ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తు, రెజ్యూమ్ లను tomcom.resume@gmail.com కు మేయిల్ చేయాలని మరిన్ని వివరాలకు 9440052081, 9440051452 ఫోన్ నెంబర్ల నందు సంప్రదించాలని ఉపాధి అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.















