EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కాళేశ్వరం ప్రాజెక్టులో బయటపడిన మరో లోపం

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో లోపం బయటపడింది. అన్నారం సరస్వతి బ్యారేజీకి లీకేజీలు కలకలం రేపుతున్నాయి. బ్యారేజీలో 28, 38 నంబర్ గల రెండు గేట్ల వద్ద లీకేజీతో నీరు ఉబికి వస్తోంది. దీంతో ఇంజనీరింగ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇసుక సంచులు వేసి ఊటలను నిలువరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం బ్యారేజీలో నీరు 5.71 టీఎంసీలు ఉంది. ఒక గేటు ఎత్తి అధికారులు 2357 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 10.87 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో అన్నారం సరస్వతి బ్యారేజ్‌ను నిర్మించడం జరిగింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ డ్యామేజ్ ఘటన మరిచిపోకముందే అన్నారం సరస్వతి బ్యారేజ్ లీకేజీ కలకలం రేపుతోంది

Related News

Select the Topic
Scroll to Top